తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మార్తి సాయి మోహన్ యాదవ్(జనరల్ మెడిసిన్) ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి , శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ వైద్యులు గా నియమితులైన డాక్టర్ మార్తి సాయి మోహన్ యాదవ్ పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు,పట్టణ కన్వీనర్ కుంట లక్ష్మణ్, నూకారపు రమేష్, ముత్యం బాబు, వట్టం రాంబాబు ,అడప అప్పారావు, యాదగిరి గౌడ్,ఆవుల నర్సింహారావు,ముద్దంగుల కృష్ణ,అక్కి నరసింహారావు, జావీద్ పాషా,పాకాల రమాదేవి మండల పట్టణ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ