తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిట్టి రామవరం తండాకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబాలకు తక్షణమే పోడు పట్టాలు ఇవ్వాలని 19వ డివిజన్ సిపిఐ నాయకులు బానోత్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు.కొత్తగూడెం RDO గారి కి వినతి పత్రం ఇచ్చి అధికారంలో ఉన్న ఆర్డిఓ కి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పరిష్కారం కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు భూ సమస్యలు ఏమైనా ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. చిట్టి రామవరం ప్రాంత గిరిజన లంబాడి రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. గరిపేట గ్రామపంచాయతీ గ్రామ పరిధిలోని అంబేద్కర్ నగర్ బీట్ లోని ఫారెస్ట్ భూమి కంపార్ట్మెంట్ నెం. 1 సర్వే నంబర్ 20 లో గల ROFR ఫారెస్ట్ పోడు భూములను గత 1980 నుండి 45 సంవత్సరాలుగా మా పూర్వీకుల కాలం నుండే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు మాత్రం మా వ్యవసాయ భూమిలో పోనివ్వకుండా భయభ్రాంతులు చేస్తున్నారు . మా భూమి మొత్తం 54 ఎకరాలలో కేవలం 18 ఎకరాలు మాత్రమే ఇచ్చి మిగిలిన భూమి వాళ్ళు స్వాధీనం చేసుకుని మమ్మల్ని భూమి పై పోనివ్వకుండా అడ్డుపడ్డారని మా భూముల నుండి మమ్మల్ని దూరం చేస్తున్నారని చిట్టి రామవరం రైతులు కొత్తగూడెం RDO గారికి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు మా భూమి అందులో నుంచి 18 ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చారు. మా గిరిజన రైతులకు ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని. మిగతా పోడు రైతులకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా న్యాయమైన అధికారులు ఉండి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టి రామవరం తండా పోడు రైతులు నాయకులు, మూడు రమేష్ నాయక్, భూక్య రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ