తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ఎర్త్ యూనివర్సిటీ క్యాంపస్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడి వైస్ ఛాన్సులర్లతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడున్నర గంటల వరకు శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలను పరిశీలించనున్నారు. అక్కడ నుండి కొత్తగూడెం భవిత కేంద్రం పరిశీలన అనంతరం ఆరున్నర గంటలకు కేజీబీవీ పాఠశాలలలో ఆకస్మిక తనిఖీ చేపట్టనున్నారు. అనంతరం బూర్గంపాడు టి జి ఆర్ జి ఐ ఎస్ లో పాఠశాల పరిశీలన మరియు విద్యార్థులు, సిబ్బందితో సమీక్ష సమావేశం
Admin
తెలుగు వెలుగు టీవీ