Thursday, 17 September 2026 09:12:25 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజా కోరికలను ప్రతిబింబించే విధంగా గ్రామసభలు నడవాలి. 16 వ డివిజన్ గ్రామ సభలో ముఖ్యమంత్రి సందేశాన్ని చదివిన కార్పొరేటర్ మునిగడప పద్మ.

Date : 02 April 2026 07:44 PM Views : 362

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99 రోజుల యాక్షన్ ప్లాన్) కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడు గణేష్ మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 16 వ డివిజన్ లో డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో మొదట తెలంగాణ గీతం ఆలాపన మరియు ముఖ్యమంత్రి సందేశం చదివి డివిజన్ ప్రజలకు వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో డివిజన్లో చేపట్టిన రహదారులు డ్రైనేజీలు మిషన్ భగీరథ పనులు ప్రభుత్వం రెండు సంవత్సరాల మూడు నెలల్లో చేపట్టిన తదితర పథకాలను అధికారులు తెచ్చిన రికార్డులను చదివి వినిపించారు. ఈ గ్రామసభ ప్రభుత్వ పథకాలను చదివి వినిపించే విధముగా కొత్త పథకాలను మంజూరు చేసి గ్రామసభలు పెట్టుంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేదని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సబ్ జైల్ ప్రాంగణంలో గతంలో మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం సింగరేణి సంస్థ వారు స్థలం విషయంలో పర్మిషన్ జాప్యం వల్ల నిర్మాణం జాప్యం అవుతుందని అట్టి నిర్మాణాన్ని శాసనసభ్యులు కూనంనేని సహకారంతో త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలు మంచినీటి కోసం కష్టపడొద్దని ఎమ్మెల్యే కూనం నేని 125 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకాన్ని సాధించారని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలలలో ఈ ప్రాంత ప్రజలకు ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి ఇతర పథకాల విషయంలో మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగంగా ఆర్టిసి ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలు నడుస్తున్నప్పటికీ, 500రూ.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఉచిత కరెంటు కూడా చాలా మందికి అందటం లేదని అన్నారు. అలాగే వితంతు ,వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు డివిజన్ వ్యాప్తంగా 72 మంది పెన్షన్లు ఎంక్వయిరీ చేసి అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేసినప్పటికీ గత 7 , 8 సంవత్సరాల నుండి ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలేదని ఈ ప్రజా పాలన సందర్భంగా నైనా ప్రభుత్వం కొత్త పెన్షన్లను తక్షణమే మంజూరు చేసి వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వార్డు స్పెషలాఫీసర్ కి తెలియజేశారు. అదేవిధంగా గతం ప్రజా పాలనలో అర్హుల జాబితాలో లేని ఇందిరమ్మ, ఇంటి స్థలాల లబ్ధిదారులు పెన్షన్ దారులు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. అర్హులైన ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను పరిశీలించి శాసనసభ్యులు ,కలెక్టర్ గార్ల దృష్టికి తీసుకెళ్లి పథకాలు మంజూరయ్యట్లుగా చూడాల్సిందిగా వార్డ్ స్పెషలాఫీసర్ కి విజ్ఞప్తి చేశారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఇంటింటి మహిళకి 2500 రూపాయలు వేస్తామన్న పథకాన్ని అమలుపరిచి రాష్ట్ర మహిళ ఆశీస్సులను పొందాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామసభలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ శ్రావణి వార్డ్ ఆఫీసర్ శివరాం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు,ఆర్పీలు జానకి, కవిత, అంగన్వాడీ టీచర్స్ సరోజ, నీలవేణి, షహనాజ్, ఆయాలు వెంకటలక్ష్మి, డివిజన్ పెద్దలు, ముద్దం మార్తమ్మ మంగమ్మ నూనె శాంత, సిపిఐ నాయకులు అస్లాం వివిధ పార్టీల నాయకులు చనగరపు నరేష్ జుతుక దిలీప్, ఎల్ వంశీ, ఎస్ వంశీ ,మహేష్ గుంజ వెంకన్న ,ఉప్పుతల శీను తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :