Thursday, 17 September 2026 02:51:31 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

చలో హైదరాబాద్-ఇందిరాపార్కు ధర్నాను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

Date : 05 July 2026 06:51 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇల్లు, ఇంటి స్థలం కోసం రాష్ట్ర రాజధానికి దండుగా కదులుదాం. చలో హైదరాబాద్-ఇందిరాపార్కు ధర్నాను జయప్రదం చేయండి.నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు. గుడిసెల కూల్చివేత చర్యలను ప్రభుత్వం మానుకోవాలి.అర్హులైన ప్రతికుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా. ఇల్లు మరియు ఇంటి స్థలం కోసం నిరుపేదలంతా ఏకమై రాష్ట్ర రాజధానికి దండుగా కదలాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు పోరాటాలు కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం, పేదల ఇండ్ల కూల్చివేతలు నిరసనగా అదేవిధంగా పెదాలు నిర్మించుకున్న ఇండ్లకు విద్యుత్ సౌకర్యంతోపాటు ఇంటి నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సోమవారం నిర్వహించ తలపెట్టిన 'చలో హైదరాబాద్' ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్‌లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న నిరుపేదల గుడిసెల కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు తమ సొంత శ్రమతో నిర్మించుకున్న ఇండ్లకు తక్షణమే ఇంటి నెంబర్లు కేటాయించాలని, అలాగే విద్యుత్, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలా కాకుండా ప్రజావ్యతిరేక విధానాలతో పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరే వరకు, ప్రతి గుడిసెకు పట్టా ఇచ్చే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ రాజధాని ముట్టడి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ టౌన్ కార్యదర్శి కంచర్ల జమలయ్య, నాయకులు రామవరం ఏరియా కార్యదర్శి గోపి కృష్ణ, సర్పంచి వాడె రాములు, కార్పొరేటర్ కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, రాజు, దార లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :