తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులను శనివారం పాఠశాల చైర్మన్,హుస్సేన్, కరస్పాండెంట్ కె.పి ఉపాధ్యాయని ఉపాధ్యాయులు జూలూరుపాడు లోని మామిడి తోటలోకి వనవిహారయాత్రకు తీసుకొని వెళ్లి పిల్లలతో సరదాగా ఆటపాటలతో గడిపి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు, భోజనాల అనంతరం, విద్యార్థులందరూ ఆడుతూ పాడుతూ సరదాగా కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ పిల్లలను ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఆటపాటలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల చైర్మన్ హుస్సేన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ హుస్సేన్ని, మరియు సిద్ధార్థ పాఠశాల మాజీ చైర్మన్ పూర్ణ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సాయి ఎక్స్ లెంట్ పాఠశాల చైర్మన్ హుస్సేన్ మాట్లాడుతూ,విద్యార్థి దశలో పిల్లలను వన విహారయాత్రలకు తీసుకు వెళ్లడం వలన విద్యార్థులలో ఐక్యమత్యత, కలిసిమెలిసి ఉండే స్వభావం, సోదర సోదరీ భావాలు అలవాడతాయని అన్నారు. విద్యార్థులకు వన విహారయాత్రలు, వన భోజనాలు మధురమైన జ్ఞాపకాలను మిగులుస్తాయన్నారు. పాఠశాలల యాజమాన్యాలు పిక్నిక్ స్పాట్లను ఎంచుకొని విద్యార్థులను విహారయాత్రలకు తీసుకు వెళ్లడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం తో పాటు, మంచి పద్ధతులు, స్నేహభావం,కలసి మెలిసి ఉండే స్వభావాలు అలవాడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ హుస్సేన్, కరస్పాండెంట్ కె.పి, ఉపాధ్యాయనిలు, శారద,.బీ సరిత, ఏ సరిత, జె శివకుమారి, అనిత, నబీన, సాహితి, దుర్గ భవాని, సుజాత, హరిత, రజిత, జమున, అరుణ, సత్యవతి, కుమారి, పావని, ప్రశాంతి, భాను, పద్మావతి, నవ్య, ఉపాధ్యాయులు, రాంబాబు, రామ్ కుమార్, భద్రం, పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ