తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డీసీసీ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణకు గురువారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా కొత్తగూడెం పట్టణ కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం, డీసీసీ అధ్యక్షులు పొడెం వీరయ్య, ఎంపి రామసహాయం రఘురామిరెడ్డి, టీపీసీసీ అబ్సర్వర్స్ ఈడ్పుగంటి సుబ్బారావు, సాగరిక, సంజీవ్ ముదిరాజ్ కోఆర్డినేటర్ కె నాగేందర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్న ఆయన డీసీసీ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, పార్టీ కోసం పని చేసిన వారికి ఇదో మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ