Friday, 18 September 2026 02:05:54 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Date : 09 September 2025 04:46 PM Views : 626

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు టేకులపల్లి మండలం లచ్చ గూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ స్థాయి సెట్యురేషన్ క్యాంప్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘనశ్యాం సోలంకి పాల్గొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలు తెరవడం, జీవనజ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి అవగాహన కల్పించి నమోదు చేయడం, కె. వై.సి. నమోదు, నామినేషన్ సౌకర్యం, క్లెయిమ్ చేయని డిపాజిట్లపై అవగాహన కల్పించడం, వివిధ బ్యాంక్ పథకాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియచేశారు. ఖాతా దారులకు మెరుగయిన సేవలు అందించే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని తెలియచేశారు. సత్యనారాయణ, రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నదన్నారు. మన జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మునుపెన్నడూ లేనివిధంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, మునగ, కొరమీను పెంపకం, మేకల పెంపకం, కౌజుపిట్టల పెంపకం , పుట్టగొడుగుల పెంపకం ఇలా ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా కృషిచేస్తున్నారని, గ్రామీణ యువత కు ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా ఉపయోగించి ప్రజలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని, సూచించారు. పంట రుణాలు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలని తద్వారా తక్కువ వడ్డీ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించి, రుణ చరిత్ర సరిగా ఉంచుకోవడం ద్వారా బ్యాంకుల నుండి మరిన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు తమ బ్యాంక్ విరివిరిగా రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. PMJJBY మరియు PMSBY పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలనీ, కేవలం సంవత్సరానికి 436 రూపాయిలతో రెండు లక్షల రూపాయిల జీవిత బీమా మరియు 20 రూపాయిలతో రెండు లక్షల రూపాయిల ప్రమాద భీమా పొందవచ్చని తెలిపారు. అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలో ఈ పథకం పొందవచ్చని తెలిపారు. ప్రతి వ్యక్తి బ్యాంక్ లావాదేవీలపై అవగాహన పెంచుకుని ఆర్థికంగా దృఢంగా, సురక్షితంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ శాఖల ద్వారా ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నదని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని తెలియచేశారు. జిల్లాలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా తమ శాఖలు మరియు వినియోగదారుల సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం ఖాతాదారులు తమ అన్ని శాఖలు మరియు వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా సులభంగా కె . వై . సి. వివరాలు నవీకరించుకోవచ్చని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించాలన్న లక్ష్యంతో తమ అన్ని శాఖలు పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీకాంత్ , లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, మేనేజర్ (ఎఫ్.ఐ) భానుపద్మ శ్రీ , టేకులపల్లి శాఖ మేనేజర్ ముఖేష్, పంచాయతీ సెక్రటరీ కవిత, సి. యస్.పి. జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ మరియు సి. యస్. పి లు , ఫ్ .ఓ. ఎస్. కృష్ణ, సి.ఎఫ్.ఎల్.కౌన్సిలర్లు నాగేశ్వరరావు, జగ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :