తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతి- ఆరోగ్య మహాసభలు కొత్తగూడెంలో జరగడం మనకు గొప్ప సదవకాశమని ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు, జాతీయ బాలోత్సవ్ కన్వీనర్, ప్రకృతి ఆశ్రమం గౌరవ సలహాదారు డాక్టర్. వాసిరెడ్డి రమేష్ బాబు అన్నారు. ఈనెల 23 ఆదివారం, కొత్తగూడెంలోనే కొత్తగూడెం క్లబ్ లో జరుగనున్న ప్రకృతి ఆరోగ్య మహాసభల కరపత్రాలను, ఆశ్రమ సభ్యులతో కలిసి, బుధవారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలందరికీ, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, సామాజిక ఆరోగ్యాన్ని మరియు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ విషయాలను తెలియచేసేందుకు ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. మన ప్రాంతవాసి, మనందరికీ ఇష్టుడు, ప్రముఖ ప్రకృతి కవి, ప్రజా కవి, సినీగేయ రచయిత, సింగరేణి బిడ్డ జయరాజు నేతృత్వంలో ఈ ఆరోగ్య మహాసభలు జరగడం అభినందనీయమన్నారు. ఈ సభలలో జయరాజు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, స్టెప్ రెండు రాష్ట్రాలు సమన్వయకర్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు లు పాల్గొంటారని వెల్లడించారు. కొత్తగూడెం వాసులు ఈ మహాసభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కరపత్రాల ఆవిష్కరణలో, సభల కో-ఆర్డినేటర్ జి సుగుణారావు, కొత్తగూడెం మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్ మొక్కల వెంకటయ్య, శోభారాణి, దయానందసాగర్, బంగారి శంకర్, టి. రాయాలింగు, కె.రమేష్ బాబు, తుంపురు శివ, ముబారక్, దశరథ్ లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ