తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరు. రైతు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు వీడాలి. నీట్ పరీక్ష లీకేజీపై విచారణ చేపట్టాలి.పంటలకు కనీస మద్దతు ధర చట్టం తెవాలి. రామాలయం నిధుల దుర్వినియోగంపై సమాధానం చెప్పాలి.ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి.నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ప్రజా పోరాటాలతోనే మార్పు సాధ్యం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు.కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రల ముగింపు బహిరంగ సభ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఘనంగా జరిగింది. సందర్భంగా అశ్వరావుపేట పులివెందులలో యాత్రకు పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు, అక్కడినుంచి పట్టణంలోని ప్రధాన సెంటర్ల మీదుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ప్రజలు, రైతులు, కార్మికులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరలను అదుపు చేయడంలో నిరుత్సాహపరిచారని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గ్యారెంటీ చట్టాన్ని ఇప్పటికీ తేలేదని, విదేశీ వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు, ఇతర ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో అలసత్వం వహిస్తోందని భాగం హేమంతరావు పేర్కొన్నారు.అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాష మాట్లాడుతూ పాత పింఛన్లు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పదేపదే దరఖాస్తులు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పేదల ఇళ్లను, గుడిసెలను తొలగించడం సరికాదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతాంగం, కార్మికులు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పోరాటాలను తీవ్రతరం చేయడమే మార్గమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరి వెంకటేశ్వర్లు మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, నరాటి ప్రసాద్, చండ్ర నరేంద్ర కుమార్, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమాలయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, మువ్వా వెంకటేశ్వర్లు,కందుల భాస్కర్, SK ఫహీం, ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు భూక్యా శ్రీనివాస్, వరక అజిత్, వేము కొండల రావు,నిమ్మల రాంబాబు, రత్నకుమారి, విజయ్, రామకృష్ణ కార్పొరేటర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ