Wednesday, 16 September 2026 05:09:55 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారుల

Date : 25 August 2025 05:15 PM Views : 443

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు. అశ్వాపురం మండలం కళ్యాణపురం గ్రామానికి చెందిన గుమ్మడి సాగర్ ఇంటర్ వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నానని కుటుంబ పోషణ భారంగా ఉన్నదని తనకు ఏదైనా ఒక కార్యాలయంలో అటెండర్ జాబు గాని వాచ్ మెన్ జాబు గాని ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన తలారి ముత్తయ్య ప్రజాపాలన కార్యక్రమంలో ఉచిత కరెంటు కొరకు గృహ జ్యోతి పథకంకి దరఖాస్తు చేసుకోని ఉన్నానని కానీ నా ఇంటికి కరెంట్ బిల్లు వస్తున్నాదని తనకు గృహ జ్యోతి పథకం కింద ఉచిత కరెంటు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం చంద్రుగొండ ఎంపీడీవో కి ఎండార్స్ చేశారు..

ఇల్లందు మండలం ఇందిరానగర్ కు చెందిన మహమ్మద్ సాదిక్ w/o గౌస్ నా భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోయాడని తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాను తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు బెనిఫిట్స్ సరిపోవడం లేదని తన తెల్ల రేషన్ కార్డును అన్నపూర్ణ కార్డుగా మార్చగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా పౌరసరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గతంలో నిర్మించినటువంటి పశువుల భవనం శిథిలావస్థలో ఉన్నదని చుట్టుపక్కల గోడలు కూడా పగిలిపోయి ఉన్నాయని పశువుల వైద్యం కొరకు ఇబ్బందిగా ఉన్నదని వారి గ్రామానికి కొత్త పశువుల భవనము మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా పశుసంవర్ధక అధికారికి ఎండార్స్ చేశారు.. చుంచుపల్లి తండాకు చెందిన బానోతు రమేష్ నాయక్ తమ పిల్లలు లక్ష్మీదేవి పల్లి మండలం త్రివేణి పాఠశాల నందు ఏడు, ఆరో తరగతి చదివి ప్రస్తుతం వేరే పాఠశాలలో చదువుతున్నారని తమ పిల్లలకు టీసీ ఇవ్వాలని పాఠశాలలో దరఖాస్తు చేసుకోగా నేటి వరకు టిసి ఇవ్వడం లేదని కావున మా పిల్లలకు టిసి ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి కి ఎండార్స్ చేశారు..

బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామంలో 37 కుటుంబాలతో జీవనం సాగిస్తున్నామని ప్రధాన రహదారి నుంచి మా గ్రామానికి వెళ్లడానికి రోడ్డు వసతి లేక ఇబ్బందులకు గురవుతున్నామని అంతేకాకుండా వారి గ్రామంలో త్రాగునీటి సమస్య అధికంగా ఉండదని చిన్నపిల్లలు చదువుకోడానికి అంగన్వాడి మరియు పాఠశాల లేవని కరెంటు కూడా లేక ఇబ్బందులకు గురవుతున్నామని కావున వారి గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేసిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్య నిమిత్తం డి సెక్షన్ కి ఎండార్స్ చేశారు.. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :