Monday, 03 August 2026 02:00:13 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పాల్వంచ నవభారత్ "కాలనీ"లో భారీ చోరీ..!

Date : 26 January 2025 06:43 PM Views : 3775

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం , పాల్వంచ జనవరి 26 ( తెలుగు వెలుగు) పాల్వంచ మండలంలోని నవభారత్ కి చెందిన నవనగర్ కాలనీలోని క్వార్టర్స్ లో దొంగలు పడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన ఆదివారం జరిగింది. నవ నగర్ లోని క్వార్టర్స్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్, ప్రతాప్, అంజద్ పాషాల క్వాటర్స్ తో పాటు మరో ఏడు క్వార్టర్స్ లో దొంగలు చొరబడ్డారు. ఎన్బి-47 క్వార్టర్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్ ఇంట్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3.5 లక్షల నగదుని చోరులు అపహరించారు. క్వార్టర్స్ లోకి చొరబడ్డ దొంగలు ఆయా ఇళ్లల్లోని సామాగ్రిని, బట్టలను చిందరవందరగా పడవేసి హల్చల్ చేశారు. అదేవిధంగా బి-11 క్వార్టర్లో నివాసముంటున్న ప్రతాప్ ఇంట్లో సుమారు 61 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దోచుకు వెళ్లారు. బి-16 క్వార్టర్లోని అంజద్ పాషా ఇంట్లో సుమారు 8 తులాల బంగారం అపహరించు కెళ్ళారు. అదేవిధంగా మిగతా క్వార్టర్స్ లో కూడా చోరీ చోరీ జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ ఆయా యజమానులు ఇంకా నవ నగర్ కు చేరుకోలేదు. సరిగ్గా ఆ క్వార్టర్స్ లో నివాసముండే యజమానులు లేని సమయాన్ని అదునుగా చూసి దొంగలు చొరబడి దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కేవలం ఎంట్రన్స్ లో మాత్రమే రెండు సీసీ కెమెరాలు అమర్చారు. కాలనీలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, నిఘ వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగినట్లుగా అవగతం అవుతుంది. సమాచారం తెలుసుకున్న పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు సుమన్, రామారావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంని రంగంలోకి దించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఎంత మేరకు నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అనే విషయం తెలియాల్సి ఉంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :