తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నట్లు గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి ఎమ్మెల్యే ఆర్జీలను స్వీకరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ