తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3, 2025 సందర్భంగా శ్రీయుత డైరెక్టర్, దివ్యాంగుల, వయో వృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ సాధికారత శాఖ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాలు- 2025 ప్రధానం కొరకు వ్యక్తిగత మరియు సంస్థాగత క్యాటగిరి కింద దివ్యాంగుల సాధికారత కోసం సేవలందిస్తున్న అర్హులైన వ్యక్తులు లేదా సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. A. వ్యక్తిగత కేటగిరి నందు 1. దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న అత్యుత్తమ వ్యక్తి. 2. రోల్ మోడల్. 3. దివ్యాంగుల అత్యుత్తమ సృజనాత్మకత కలిగిన బాలుడు/బాలిక. 4. అత్యుత్తమ పునరావస నిపుణులు/సిబ్బంది వైకల్య రంగంలో పనిచేస్తున్న వారు. B. సంస్థాగత వర్గం: 1. దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న అత్యంత అత్యుత్తమ సంస్థ. 2. దివ్యాంగుల కోసం పనిచేసే ప్లేస్మెంట్ ఏజెన్సీ. పైన పేర్కొనబడిన కేటగిరీల వారిగా దరఖాస్తు ఫారం మరియు మార్గదర్శకాల కొరకు www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించగలరు. దరఖాస్తుదారుడు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి చిరునామా : సంచాలకుల కార్యాలయం, దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారిత శాఖ, గ్రౌండ్ ఫ్లోర్, దివ్యాంగుల సంక్షేమ భవన్, నల్గొండ ఎక్స్ రోడ్, మలక్ పేట్, హైదరాబాద్. పిన్ కోడ్:500036 నకు నవంబర్ 20, 2025 సాయంత్రం 5:00 గంటలలోపు హార్డ్ కాపీని సమర్పించాలి. వివరాల కొరకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించగలరు.
Admin
తెలుగు వెలుగు టీవీ