Thursday, 05 November 2026 11:59:37 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

సమస్యలు పరిష్కరించకుంటే సమరమే : ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్

Date : 13 July 2026 05:23 PM Views : 274

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - అంగన్వాడీలు కట్టు బానిసలు కాదు - రూ.18 వేల గౌరవ వేతన హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలి - అంగన్వాడీలతో పెట్టుకుంటే ప్రభుత్వానికి పతనం తప్పదు - ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్ - కలెక్టరేట్ ముట్టడి విజయవంతం.. - ముగిసిన అంగన్వాడీల పాదయాత్ర అంగన్వాడీల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సమరం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండవ సోమవారం రోజు పాల్వంచ పరిధిలోని పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణ నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీగా పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని వందలాది మందితో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిడబ్ల్యుఓ స్వర్ణలత లేనిన కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూసఫ్ ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు కట్టు బానిసలు కాదని, చాలీచాలని వేతనాలు ఇస్తూ అధిక పని భారంతో వెట్టి చాకిరీ చేయించుకోవాలనే ప్రభుత్వ వైఖరిని ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలతో పెట్టుకున్న ప్రభుత్వాలకు పతనం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు రూ.18 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం పాలకులకు తగదని మండిపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార పంపిణీ, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీల శ్రమను గుర్తించకుండా వారిపై సంబంధం లేని అదనపు విధులను మోపడం దారుణమన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా పనిభారం పెంచడం శ్రమదోపిడీయేనని ధ్వజమెత్తారు.అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని యూసఫ్ డిమాండ్ చేశారు. రూ.18 వేల గౌరవ వేతన హామీని అమలు చేయడంతో పాటు పని భారాన్ని తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల ఆగ్రహాన్ని ప్రభుత్వం తక్కువగా అంచనా వేయొద్దని, వారి పోరాటానికి ఏఐటీయూసీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా సమరభేరి మోగిస్తామని యూసఫ్ హెచ్చరించారు. ముగిసిన పాదయాత్ర : ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో వచ్చే పట్టిన పాదయాత్ర సోమవారం కలెక్టరేట్ చేరుకోవడంతో ముగిసింది. దారి పొడవున ఏఐటియూసి ఎర్రజెండాలు హోరెత్తించాయి. సుమారు 40 కిలోమీటర్ల మేర నాయకులు అంగన్వాడీలు పాదయాత్ర నిర్వహించారు. రెండు రోజులు సాగిన ఈ పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సోమవారం పాల్వంచలో సిపిఐ నాయకులు ఆడుసుమిల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, వీషంశెట్టి విశ్వేశ్వరరావు తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు నరాటి ప్రసాద్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతా మహాలక్ష్మి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాయి ఈశ్వరి కరుణకుమారి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి అరుణ గోనె మణి తో పాటు మువ్వా లక్ష్మీ కుమారి కంచర్ల జమలయ్య వేల్పుల మల్లికార్జున్ రాజు షాహిన్ ధన లక్ష్మి కైసర్ పద్మ లక్ష్మి ప్రమీల రాణి సరోజ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :