తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వసుంధర షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. చివరి రోజున నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్ర కూడా భక్తుల సందడి తో..ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో శోభాయమానంగా జరిగింది. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన వసుంధర షాపింగ్ మాల్ యజమాని శంకర్ బాబు ని మరియు వారి శ్రీమతి రాజేశ్వరి ని ఆత్మీయ మిత్రబృందం ఘనంగా సన్మానించింది.భక్తి, సేవాభావంతో గణేష్ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించినందుకు వారికి ఈ ఆత్మీయ సన్మానం జరిగింది.సన్మాన కార్యక్రమం అనంతరం మిత్రులు, అభిమానుల సమక్షంలో.. సంప్రదాయ రీతిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం లో సహకరించిన ప్రతీ ఒక్కరికీ తాటిపల్లి శంకర్ బాబు దంపతులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.ఈ బృహత్కర కార్యక్రమం లో గునిపాటి ఆనంద్, ఐత ప్రకాష్, ఐత విశ్వేశ్వరావు, పళ్ళ పోతు వాసు, పబ్బతి శశి, బొడ్ల మహేష్, గౌరు వెంకటేశం, అబ్బగాని వెంకటేశ్వర్లు, కొయ్యడ నగేష్, వేమిశెట్టి శ్రీనివాస్, నరేంద్రుల సుదర్శన్, చారుగుండ్ల నాగేశ్వరావు, బోగా నారాయణ, బోగా రవి, కంబంపాటి రమేష్, మోడెమ్ మోహన్ రావు, అన్నవరపు శ్యాం, ఎం.వెంకటేశ్వర రావు, పసుమర్తి అనంతం, తేరాల వీరభద్రరావు మరియు పట్టణ ప్రముఖులు, తాటిపల్లి కుటుంబ శ్రేయోభిలాషులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ