తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ