తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శనివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గా అమ్మవారిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగసీతారాములు యాదవ్ సందర్శించారు.ఈ సందర్భంగా కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ కేకే,OBC జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ