Thursday, 17 September 2026 11:00:21 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రపంచానికే ఆదర్శంగా అద్భుత నిర్మాణం, తెలంగాణ ఖ్యాతిని పెంచేలా యూనివర్సిటీ నిర్మాణం, మంత్రి తుమ్మల

Date : 22 August 2025 08:19 PM Views : 535

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచానికే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని(కొత్తగూడెం)ఆదర్శంగా నిర్మించేలా అద్భుత ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ప్రముఖ ఆర్కిటెక్ ఉష రూపొందించిన కొత్తగూడెం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణ ప్లాన్ ను వైస్ ఛాన్స్ లర్ శ్రీమతి యోగితారాణా ఇతర అధికారులతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రంలోని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ తలమానికంగా నిలిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అన్ని మౌళిక సదుపాయాలతో యూనివర్సిటీ నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాలతో పకడ్బందీగా ప్లాన్ ను రూపొందించాలని మంత్రి సూచించారు. విద్యార్థులు, లెక్చరర్లు అసౌకర్యం లేకుండా విశాలమైన తరగతి గదులు, హాస్టల్లు, గ్రంథాలయాలను నిర్మించాలన్నారు. ఆర్కిటెక్ తయారు చేసిన డిజైన్లను ముఖ్యమంత్రికి త్వరలోనే చూపించి, ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్లను ఆమోదం తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. మీదుగాఈ విషయమై భద్రాద్రి కొత్తగూడం కలెక్టర్ తో మాస్టర్ ప్లాన్ గురించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలలోనే తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మత్తులు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాలలో యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అని.. ఇది తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, దేశానికే తలమానికంగా ఆకర్షనీయమైన డిజైన్లతో దీనిని నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ 300 ఎకరాల విశాల ప్రాంతంలో రూపుదిద్దుకోని, అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణంతో వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. మంత్రి తుమ్మల ప్రత్యేక కృషి...

మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడంలో మంత్రి తుమ్మల కృషి అపారం. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆయన శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కృతకృత్యులయ్యారు. ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలు చాటేలా మంత్రి తుమ్మల విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి విశ్వవిద్యాలయంగా మార్చడంలో, బిల్లు ఆమోదించడంలో తుమ్మల చూపిన చొరవ మరువలేనిది. ఖమ్మం జిల్లా ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేలా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో మంత్రి తుమ్మల అలుపెరుగని పోరు చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :