Saturday, 19 September 2026 04:23:39 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 13 March 2026 05:41 PM Views : 337

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వలస గుత్తికోయ గ్రామాలైన నీలాద్రిపేటగండి,అశ్వాపురంపాడు ప్రజలకు ఏర్పాటు చేసిన సోలార్ వీధి దీపాలు,ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల వలస గుత్తి కోయ గ్రామాలైన నీలాద్రిపేటగండి,అశ్వాపురం పాడు గ్రామాలలో ప్రజలకు శుక్రవారం నీలాద్రిపేట గండి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు సోలార్ వీధి దీపాలను కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారుగా 70 కుటుంబాల నుండి 300 మంది ఆదీవాసీ ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.వలస ఆదివాసి ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు నిత్యం కృషి చేస్తున్నామని తెలియజేశారు.విద్య,వైద్యం,రవాణా సౌకర్యాలను వారికి కల్పించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ వారికి కూడా మెరుగైన జీవితాన్ని అందించడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నింటిని కూడా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరలు,నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.యువతకు టీ-షర్ట్స్ తో పాటు వాలీబాల్ కిట్లను అందజేశారు.స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు,నోటుబుక్స్ తో పాటు సోలార్ స్టడీ ల్యాంప్స్ ను అందజేశారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులను పంపిణీ చేశారు.గ్రామాలలో ప్రజలకు సేవాలందించిన వైద్య బృందానికి ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.తమ గ్రామంలో సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసినందులకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి,పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సైలు సురేష్,,పి.వి.ఎన్ రావు,సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :