తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు నేరసమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీసు అధికారులందరితో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ముందుగా మార్చి నెలలో విధుల పట్ల అంకితభావంతో పనిచేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.క్రికెట్ బెట్టింగులు,ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా మరియు ఇతర సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులకు శిక్షపడేలా పనిచేయాలని తెలిపారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేయాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,డయల్ 100 నకు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలబడాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు,సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.రాబోయే వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని దొంగతనాల నివారణకై ప్రజలను అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలియజేశారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించారాదని అన్నారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వ్యక్తులపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్ మరియు సీఐలు, ఎస్సైలు,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ