తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలని అత్యంగా ఘనంగా నిర్వహించుటకు పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ను అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మరియు దళిత సంఘాలు ఆధ్వర్యంలో శాలువ,గజ మాలతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర సభ్యులు జేబీ శౌరి ,దళిత సంఘల నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వందలాది మందితో కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లోఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.8 లక్షలకు పైగా సింగరేణి సీఅండ్ఎండి బలరాం నాయక్ తోడ్పాటుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిచ్చెనను ఏర్పాటు చేయడం జరిగిందని,అదే విదంగా అంబేద్కర్ భవన్ కి నిధులు కేటాయించి సంఘాల ద్వారా అంబేద్కర్ భవన్ ను ఉపయోగంలోకి తేవాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర సభ్యులు జేబీ శౌరి,కూసపాటి శ్రీనివాస్ మాదిగ,మధుసూదన్ చిన్ని,మంద హనుమంతు,తాండ్ర వెంకటేశ్వర్లు,హై కోర్టు న్యాయవాది యెర్రా కామేష్, కాకెళ్ళి సైమన్,బొమ్మెర శ్రీనివాస్,సబ్బారావు నాగేందర్(బుస్సి),చదలవాడ సూరి,కూరపాటి రవీందర్,మందా సాంబయ్య,గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ