Thursday, 05 November 2026 11:37:15 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

భూసేకరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 14 July 2026 05:09 PM Views : 212

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి*చంద్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం చంద్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిప్పనపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులు, మద్దుకూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, అనంతరం చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూసేకరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, క్రీడలకు అవసరమైన ప్రోత్సాహం అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముందుగా తిప్పనపల్లి గ్రామంలో కొనసాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులను పరిశీలించారు. సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిప్పనపల్లి గ్రామ పరిధిలో మొత్తం 70 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రతిరోజూ సుమారు 15 ఎకరాల మేర సర్వే చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి భూ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం మద్దుకూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, డిజిటలైజేషన్, రికార్డుల నిర్వహణను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 65 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వివరించగా, మిగిలిన ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా డిజిటలైజేషన్ చేపట్టాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న సాంబార్ పలుచగా ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, యూనిఫాంల పంపిణీపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యార్థి వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, చంద్రుగొండ తహసీల్దార్ జగదీశ్వరరావు, ఎంపీడీవో అశోక్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :