Sunday, 02 August 2026 04:02:33 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

నిరుద్యోగ సమస్య రూపుమాపలేని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదు

Date : 08 June 2026 06:52 PM Views : 112

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖాళీ పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నమన్య వరిష్కారానికి ఉద్యమిస్తాం - ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ నిరుద్యోగ సమస్యను రూపుమాపడం చేతగాని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదని, మోసపూరి.త వాగ్దానాల చేసి యువతరం ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత పాలకులు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్కే ఫహీమ్ దాదా అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అంకితక్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ప్రభుత్వాలకు అధికారాన్ని కట్టబెట్టిన యువత బ్రతుకులు నట్టేట పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా ఉన్నవారికే అడనవు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బదులుగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారని మండిపడ్డారు. ఇలాంటి విధానాలు నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని, ప్రజా సేవల నాణ్యతను కూడా దెబ్బతీస్తున్నాయని ఫహీమ్ చెప్పారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోందని, ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉండటం, మౌళిక వసతుల కొరత, నిధుల లేని కారణంగా ప్రభుత్వ విద్య నానాటికీ బలహీన పడుతోందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణా చట్టాన్ని వకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని టిజి పిఎస్సి ద్వారా వార్షిక నియామక క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్కే ఖయ్యూమ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రసూల్, రౌతు నురేష్, దాసరి శివ, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :