Monday, 03 August 2026 04:08:35 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఉప ముఖ్యమంత్రి, మంత్రుల జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 14 July 2026 07:45 PM Views : 215

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు నిర్వహించనున్న సమీక్ష సమావేశం నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అవసరమైన భద్రతా ప్రమాణాలు, బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, రాకపోకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.అనంతరం అమ్మగారిపల్లి వద్ద నిర్వహించనున్న సమీక్ష సమావేశం ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. సమావేశ వేదిక, అధికారుల, ప్రజాప్రతినిధుల కూర్చునే ఏర్పాట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, సమీక్ష సమావేశం విజయవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, నీటిపారుదల శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :