Saturday, 19 September 2026 09:54:34 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు.

Date : 30 March 2026 07:24 PM Views : 454

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన షేక్.మున్వర్ S/o.షఫీ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నందుకు 2024,2025 సంవత్సరాలలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ నందు రెండు (02) కేసులు, 2024 లో లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ నందు (01) కేసు, 2024లో ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో (01) కేసు నమోదు చేయడం జరిగింది. చివరిగా 2025 ఏప్రిల్ నెలలో దుండిగల్ పిఎస్ లో 98 కేజీల గంజాయిని సరఫరా చేస్తూ దొరకగాఅక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఐదు కేసులలో షేక్.మున్వర్ మొత్తం 287 కేజీల గంజాయిను సరఫరా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నందున అతనిపై PIT NDPS Act (పీడియాక్ట్) కొరకు పాల్వంచ డిఎస్పీ R.సతీష్ కుమార్ సూచనలతో సీఐ K.సతీష్ ప్రతిపాదించగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో ప్రతిపాదిత ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి సీఐడి అడిషనల్ డీజిపి చారు సిన్హా ఐపిఎస్ 16.02.2026 నాడు డిటెన్షన్ ఆర్డర్ (నిర్భంద ఉత్తర్వులు) ను జారీ చేయగా 18.02.2026 నాడు డిటెన్షన్ ఆర్డర్ ప్రతులను షేక్.మున్వర్ కు అందజేసి చేసి అతనిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. 17.03.2026 తేదీన అడ్వైజరీ బోర్డు (సలహా మండలి) షేక్.మున్వర్ పై వచ్చిన నిర్భంద ఉత్తర్వులపై విచారణ జరిపి భౌతిక,సాంకేతిక ఆధారాలను పరిశీలించి, PIT NDPS (PD యాక్ట్) యాక్ట్ ను సమర్థిస్తూ సంవత్సర కాలం చర్లపల్లి జైల్లో నిర్బంధించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని,ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను సేవించినా,సరఫరా(రవాణా) చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని,వారిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో పీడియాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుందని సీఐ సతీష్ తెలిపారు.అంతేకాకుండా పట్టుబడిన నిందితులు గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా కోర్టు ఉత్తర్వులతో జప్తు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :