Sunday, 02 August 2026 02:27:06 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

Date : 04 July 2026 05:42 PM Views : 85

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: ఆర్ అండ్ ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆర్ అండ్ ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే, భూసేకరణ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ కార్యాలయం క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న భూసేకరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించి సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, రోజుకు 15 ఎకరాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సర్వే బృందం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే క్షేత్రస్థాయిలో ఉండాలని, రైతులకు సంబంధించిన అంశం కావడంతో వారు పొలాల వద్ద అందుబాటులో ఉండే సమయంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. అలాగే, మరుసటి రోజు ఏ గ్రామంలో సర్వే నిర్వహించనున్నారో ముందుగానే నోటీసుల ద్వారా రైతులకు తెలియజేయాలని అన్నారు. రైతులు అందుబాటులో ఉన్న సమయంలోనే సర్వే పూర్తి చేయడం ద్వారా భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడం సాధ్యమవుతుందని అన్నారు . భూసేకరణకు సంబంధించిన పురోగతి వివరాలను ప్రతిరోజూ నివేదికల రూపంలో అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించిందని, రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయంతో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. భూ సర్వే నిర్వహణ కోసం ఏడు ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేశామని, సుమారు 3,000 ఎకరాల భూమి సర్వేను రెండు నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి బృందం ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ముందస్తు సమాచారం అందించి వారి సహకారంతో సర్వే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని భూసేకరణ సర్వేను నిర్ణీత గడువులో పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రవీంద్రనాథ్, వెంకట్రావు,రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే, భూసేకరణ శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :