తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం పలు కళాశాలల విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ (మాదక ద్రవ్యాల నిరోధం) అవగాహన ర్యాలీ జరిగింది. డీఎస్పీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ