Thursday, 17 September 2026 05:09:55 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సంజయ్ జాజు

Date : 25 August 2026 05:51 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్ నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి NEET-PG పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రాష్ట్రంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, ఈ నెల 30న నిర్వహించనున్న NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 30న నిర్వహించనున్న NEET-PG ప్రవేశ పరీక్షకు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, భద్రత, రవాణా తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను గుర్తించి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశుభ్రత, పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. స్పిరిచువల్, హెరిటేజ్, ఎకో, క్రాఫ్ట్స్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి తెలంగాణ బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, NEET-PG పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సునీత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, భూగర్భ జల శాఖ ఏడి రమేష్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :