తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కొత్తగూడెం యాదవ యువజన పట్టణ కమిటీ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగూడెంలోని జీఎస్ ఫంక్షన్ హాల్‌లో యాదవ సంఘం జిల్లా నాయకులు కోదాడ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చిలక రవి నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.యువజన పట్టణ కమిటీ అధ్యక్షుడిగా పల్లా దేవి వరప్రసాద్ యాదవ్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా అశోక్ యాదవ్, ఆవాల సునీల్ యాదవ్, సూరిమేని హరీష్ యాదవ్‌లను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా కంచం మధు యాదవ్, అమృతపల్లి ప్రణీత్ యాదవ్, బైకాను హరిప్రసాద్ యాదవ్, ముత్యాల అజయ్ యాదవ్‌లను నియమించారు. కోశాధికారిగా మీసా వేణు యాదవ్, సహాయ కోశాధికారులుగా మామిడి శ్రీనివాస్ యాదవ్, కంచం సందీప్ యాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ యాదవ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలోని యాదవ యువతను ఐక్యం చేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.నూతన కార్యవర్గ సభ్యులను యాదవ సంఘం పెద్దలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ