తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆదివారం ఉదయం ఐదు లారీలు,ఒక జేసిబీ ను జిల్లా పోలీసులు సీజ్ చేయడం జరిగింది.పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలను,దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీ,బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు మరియు ఒక జెసీబీను స్వాధీనం చేసుకున్నారు.ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధిత శాఖాధికారులతో సమన్వయం పాటిస్తూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.పట్టుబడిన ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ