Wednesday, 16 September 2026 11:26:55 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కోటి మహిళలకు కోటి చీరలు – రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పండగ వాతావరణం

Date : 19 November 2025 04:50 PM Views : 256

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పారదర్శకతతో ఇందిరమ్మ చీరల పంపిణీ – కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, గౌరవం మరియు ఆర్థిక స్వావలంబనను బలపరచడంలో భాగంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులతో రాష్ట్రవ్యాప్త వీడియో కాన్ఫరెన్స్ బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సిఎం సలహాదారు వేణు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళలకు కోటి చీరల పంపిణీని ప్రారంభించిందని తెలిపి, ఈ కార్యక్రమం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలవాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించాలని, మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చీరల పంపిణీని పండగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. మహిళల ఆర్థిక పురోగతికి ఆర్టీసీ ఉచిత ప్రయాణం, యూనిఫారమ్ కుట్టే బాధ్యతలు, ఇందిరా మహిళా శక్తి బజార్, అమెజాన్‌తో ఒప్పందాలు జరుగుతున్నాయని మహిళలు తయారు చేసే వస్తువులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సెర్ప్ అధనపు డి ఆర్ డి ఓ నీలేష్,డి పి ఓ అనూష, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశ మందిరంలో మహిళా సంఘాల సభ్యులు ముఖ్యమంత్రి ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో, సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్హత గల మహిళకు చీర అందేలా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పంపిణీ ప్రక్రియను నిష్పాక్షికంగా అమలు చేయాలని, ఎలాంటి తప్పిదాలు, ఆలస్యాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల్లో బౌతిక ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, రశీదుల యాజమాన్యం పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 8 వరకు పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అనంతరం ‘జల్ సంచయ్ – జన్ భాగీదారీ’ కార్యక్రమంలో జిల్లా సాధించిన జాతీయ అవార్డు సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలను మహిళ సంఘ సభ్యులు సత్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :