తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 23 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండల ప్రధాన కార్యాలయం నందు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ వర్ధంతి సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తదుపరి రమేష్ మాట్లాడుతూ ఆయన ఒక భారతీయ న్యాయవాది, విద్యావేత్త, రాజకీయవేత్త. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు అని జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేసిన మహానీయుడని ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలని ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, యువ మోర్చా అధ్యక్షుడు గుగులోతు రాంబాబు, సోషల్ మీడియా కన్వీనర్ భుక్యాచరణ్, బిజెపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ