Sunday, 02 August 2026 06:43:01 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

99 రోజుల కార్యాచరణపై సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ – ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 10 March 2026 08:13 PM Views : 234

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లోని సమావేశ మందిరాన్ని, సిట్టింగ్ సామర్థ్యాన్ని, భోజన ఏర్పాట్లకు కేటాయించిన ప్రదేశాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం సభా ప్రాంగణంలో సరిపడా సిట్టింగ్‌ను మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే విధంగా సభా ప్రాంగణాన్ని ఫ్లెక్సీలతో అలంకరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని ఫైర్ సేఫ్టీ అధికారులు ముందుగా పరిశీలించి ధ్రువీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన శిక్షణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని, కార్యక్రమం నిర్వహణ కోసం ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ వంటి సాంకేతిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి, వారికి గుర్తింపు కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులందరికీ భోజన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు తెలిపారు.శిక్షణ శిబిరం వద్ద అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్‌తో పాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్లు పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, నిధుల సమర్థ వినియోగం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణ అమలు విధానం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య,డీపీఓ సుధీర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :