తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు పేకాట,కోడిపందాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం తన కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నిరంతర వాహన తనిఖీలు,సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుగా గల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు.పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికి ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ