Tuesday, 03 November 2026 07:56:50 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఉద్యోగులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ

Date : 26 November 2025 06:22 PM Views : 278

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లోని ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధ్యక్షత వహించిన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. పౌర హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య బలోపేతానికి రాజ్యాంగం కలిగిన ప్రాధాన్యతను వివరించారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రజాసేవలో నిజాయితీ, కర్తవ్యనిబద్ధత అవసరమని అన్నారు. అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను అధికారులు చదివి వినిపించారు. భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ : “భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకొని, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించాలని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వేచ్ఛను అందించాలని; అవకాశాలలో సమానత్వాన్ని చేర్చాలని; వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను కాపాడుతూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని సంకల్పిస్తున్నాము. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిన ఈ రాజ్యాంగాన్ని మేము స్వీకరించి, అమలు చేయడానికి మాకు మేమే కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తున్నాము.” అని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, ఉపాధి కల్పన అధికారి కే. శ్రీరామ్, భూగర్భ జల శాఖ అధికారి రమేష్, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :