తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం మే 20 (తెలుగు వెలుగు) : కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికలాంగుల కాలనీకి చెందిన త్రివేణి(32)ని వరుసకు మరిది అయ్యే ఖమ్మం జిల్లా , చింతకాని మండలం నాగారం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగరాజు వేధించసాగాడు. ఆమెతో ఉన్న చిత్రాలను బంధువులకు పంపించి పరువుతీశాడు. దీంతో మనస్తాపం చెందిన త్రివేణి ఉరేసుకుని మృతిచెందినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ