Thursday, 17 September 2026 07:39:25 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

వేసవిలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అంకిత్ .

Date : 24 April 2026 08:16 PM Views : 154

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేసవిలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ కార్యక్రమాలు విజయవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, త్రాగునీటి సమస్యలపై వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వివరాలు, కొనుగోలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై అధికారుల నుండి వివరణ తీసుకున్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు, రవాణా సదుపాయాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు రాకుండా చూడాలని సూచించారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పరిష్కారం చూపడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిరంతరంగా తాగునీరు అందేలా చూడాలని సూచించారు. టేకులపల్లి ప్రాంతంలో త్రాగునీటి సమస్య తమ దృష్టికి వచ్చిందని, వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద సోమవారం నుండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, “సే నో టు డ్రగ్స్” కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయాలని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు, గర్భిణీలు, చిన్నారుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, సీజనల్ వ్యాధుల నివారణకు ఫాగింగ్, పరిసరాల పరిశుభ్రత పనులు చేపట్టడం, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పంచాయతీ అధికారి సుధీర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :