Thursday, 05 November 2026 06:57:26 PM
# భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో మీసేవ కేంద్రాలు కీలక పాత్ర పోషించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 January 2026 07:49 PM Views : 320

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరువ కావడంలో మీసేవ కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెగా ఆధార్ క్యాంపుల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందించిన మీసేవ కేంద్ర నిర్వాహకులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజలకు అవసరమైన ఆదాయ, కుల, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు తదితర ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ వేగవంతంగా జరగాలని అన్నారు. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్‌ల మంజూరు, వివిధ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఆధార్ సంబంధిత సేవలు వంటి అంశాల్లో మీసేవ కేంద్రాలు ప్రజలకు మొదటి సంప్రదింపు కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు.ప్రజలు వివిధ అవసరాల కోసం మీసేవ కేంద్రాలకు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర నిర్వాహకులు పూర్తి అవగాహనతో సేవలు అందించడంతో పాటు, అవసరమైన పత్రాలు, విధానాలు, గడువులు తదితర అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగవంతమైన సేవల అందజేత లక్ష్యంగా మీసేవ వ్యవస్థ పనిచేయాలని, ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించే దిశగా నిర్వాహకులు కృషి చేయాలని అన్నారు.మెగా ఆధార్ క్యాంపుల నిర్వహణ ద్వారా వేలాది మందికి ఆధార్ నమోదు, సవరణ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొంటూ, ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ మీసేవ కేంద్ర నిర్వాహకులను కోరారు. ప్రభుత్వ–ప్రజల మధ్య వారధిగా మీసేవ కేంద్రాలు పనిచేస్తూ, సంక్షేమ పథకాల విజయవంతమైన అమలుకు తోడ్పడాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు, టి జి టి ఎస్ కృష్ణ మూర్తి, మీసేవ కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :