తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు DSP చంద్రబాను తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఇల్లందులో అరెస్టు చేయడంతో పాటు, 53 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.13 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. CI సత్య నారాయణ, SI సూర్య పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ