తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కావడిగుండ్ల, గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం, కామవరం, ఇనుమూరు గ్రామాల సమీపంలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ పులి కావడిగుండ్ల, గుబ్బలమంగమ్మ, కామవరం, ఇనుమూరు అటవీ ప్రాంతాలలో సంచరించి రెండు ఆవులను చంపి తిన్నట్లు వారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, పోలీసులు పులి సంచరించిన పరిసర ప్రాంతాల్లో పాదముద్రలను గుర్తించారు. పులి ఆచూకీ తెలిసేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ