Friday, 18 September 2026 09:04:42 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 23 July 2026 06:09 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రి పంపిణీ.యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా Esscientia Advanced Sciences Private Limited సంస్థ జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రిని అందజేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఎన్‌సీసీ యూనిట్లకు శిక్షణ సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్‌సీసీ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమయపాలన, నాయకత్వ నైపుణ్యాలు, జాతీయ సమైక్యత భావన, సేవా దృక్పథం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, శారీరక దృఢత్వం, సామాజిక బాధ్యత, దేశసేవ పట్ల అంకితభావాన్ని పెంపొందించడంలో ఎన్‌సీసీ శిక్షణ విశేషంగా దోహదపడుతుందని తెలిపారు. ఎన్‌సీసీ ద్వారా తీర్చిదిద్దబడిన యువత భవిష్యత్తులో వివిధ రంగాల్లో రాణించడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు ఎల్లప్పుడూ ముందుండి సేవలందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు . జట్టు భావన, క్రమశిక్షణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి ఎన్‌సీసీ అత్యుత్తమ వేదికగా నిలుస్తోందన్నారు.ప్రభుత్వ కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సహకరించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఈ శిక్షణ సామగ్రి ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణా శిబిరాలు, రిపబ్లిక్ డే క్యాంపులు, ఇతర పోటీల్లో వారు మరింత ప్రతిభ కనబర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు 190 డమ్మీ గన్స్, 130 కంపాస్‌లు, 130 సర్వీస్ ప్రొట్రాక్టర్లు, 190 ఎన్‌సీసీ హ్యాండ్‌బుక్స్, 100 పోటీ పరీక్షల పుస్తకాలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, 11 తెలంగాణ బెటాలియన్‌కు చెందిన ఎన్‌సీసీ అధికారులు, జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్ల అసోసియేట్ ఎన్‌సీసీ అధికారులు (ఏఎన్‌ఓలు), 120 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, 7 డిగ్రీ కళాశాలలు, 18 పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :