తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాల మరియు వసతి గృహమును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మరియు సమస్యలను అడిగి స్వయంగా రాసుకున్నారు. మంచినీటి ట్యాపులు లీకేజ్ నీకు గమనించిన కలెక్టర్ స్వయంగా టాప్ ను బిగించారు.డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్స్, వంట గదులను స్వయంగా తనిఖీ చేశారు. కిచెన్ షెడ్ లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారి ని, మరియు విద్యార్థులకు వర్ణించడానికి సిద్ధంగా ఉన్న అన్నం పరిశీలించారు. వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతాలేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. పాల్వంచ ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చదువు కొనసాగించేలా అనుకూల పరిస్థితులు కల్పించాలని అధికారులు ఆదేశించారు. వసతి గృహం మరియు పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లు మరియు వసతులు నివేదికల సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ