తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : వైద్య సుగుణారావు కు ఘన సన్మానం పారంపర్య వైద్య రంగంలో ప్రకృతి వైద్యం తోపాటు, ఆల్టర్నేటివ్ తెరపిస్ట్ గా విశిష్ట సేవలు అందిస్తున్న వైద్య జి. సుగుణారావుకు ప్రతిష్టాత్మక 'వైద్య ఉత్తమ సేవాపురస్కారం' అవార్డు లభించింది. భద్రాచలంలో నిర్వహించిన పారంపర్య వైద్య మహాసంఘం (పీవీఎంఎస్)తెలం గాణ 3వ మహాసభలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించి, సన్మానించారు. గురువారం రాత్రి మూడో రోజు ముగింపు సందర్భంగా, మహాసభలో యోగ గురువు, భారత ధర్మ దేవత బ్రహ్మచారి, శైవ క్షేత్ర పీఠాధిపతులు, శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ, పారంపర్య వైద్య మహాసభ అధ్యక్షుడు దొంత యాత్రి మహర్షి, ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, మహర్షి గోశాల వ్యవస్థాపకులు సజ్జన రమేష్, పుత్తూరు చంద్రశేఖర రాజు, ఉపాధ్యక్షులు రామంచి శ్రీనివాస్, కోశాధికారి దుర్గారాణి, వైద్యశ్రీ జమాల్ ఖాన్ ల చేతులమీదుగా వైద్య సుగుణారావు అవార్డును అందుకున్నారు. అనంతరం నిర్వాహకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సంద ర్భంగా సుగుణారావు మాట్లాడుతూ.. పారంపర్య వైద్య విధానాలకు మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తానని తెలిపారు. అవార్డుతో సత్కరించిన పారంపర్య వైద్య మహాసంఘం రాష్ట్ర నాయకత్వానికి, శ్రీశ్రీ శివ స్వామిజిలకు కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారంపర్య వైద్య రంగానికి చెందిన పలువురు ప్రతి నిధులు, వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ