తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి మణుగూరు తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తెగబడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాస్వామికంగా భౌతిక దాడులు చేస్తోందని తెలిపారు. నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయంపై, అలాగే మాజీమంత్రి హరీష్ రావు కార్యాలయం పై ఇదేవిధంగా దాడులు చేశారని గుర్తు చేశారు. తమ సొంత ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చుకుని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను భౌతికంగా గాయపరిచి, పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టిన కాంగ్రెస్ గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర వాతావరణ సృష్టించిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ