తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసిస్తున్న వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకము ప్రారంభించడము. జరిగినది అందుకు మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు నూరు శాతము సబ్సిడితో అందించేందుకు ఆఫ్ లైన్లో దరఖాస్తులు http://tgobmma.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుందని ఇందుకు చివరి తేది. 18-09-2026 దరఖాస్తులు చేసుకోవలసినదిగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి. విజయలక్ష్మీ తెలిపారు. అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండవలేను : మహిళల వయస్సు 18 సంవత్సరములు నిండి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. నిరుద్యోగ మహిళలు, పేదలు, నిరాదరణకు గురైన కతంతు, ఒంటరి, వికలాంగులకు, ఆనాధ మహిళలకు మరియు టైలరింగ్ శిక్షణ తీసుకున్న సర్టిఫికేట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. కనీస అక్షరాస్యత తప్పనిసరి, 8వ తరగతి ఉత్తీర్ణులై ఉన్నవారికి అవకాశము కలదు. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ మరియు ఆధాయ ధృవీకరణ పత్రము కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయము గ్రామీణలకు రూ.1,50,000/-, పట్టణ వాసులకు రూ.2,00,000/-లకు లోబడిన వారు అర్హులు... 2023-24 సం॥లో బి.సి. కుల వృత్తుల స్వయం ఉపాధి పధకము క్రింద ఆర్థిక లబ్ది పొందిన వారు అర్హులు కారు. పథకము మంజూరి కోరకు దరఖాస్తుదారులు ఆన్లైన్లో తమ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కుల, ఆదాయ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతలు, టైలరింగ్ శిక్షణ / అనుభవం తదితర ధృవీకరణ పత్రాలతో, గ్రామీణ ప్రాంతం వారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కి , పట్టణ వాసులు మున్సిపల్ కమీషనర్ కి తేది. 15-09-2026 లోగా దరఖాస్తులు సమర్పించవలసినదిగా తేలియపరచడమైనది. కావున, జిల్లా పార సమాచార సంబంధాల అధికారి, భద్రాద్రి కొత్తగూడెం ఇట్టి సమాచారమును అన్ని దినపత్రికలలో ప్రచురించవలసినదిగా కోరడమైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ