Friday, 18 September 2026 08:04:25 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగు నర్సింహా రావు

Date : 17 June 2026 06:45 PM Views : 135

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలి విద్యుత్ సవరణ బిల్లును, న్యూక్లియర్ చట్టాన్ని ఉద్యమించాలి అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగు నర్సింహా రావు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగు నర్సింహా రావు డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. విద్యుత్ సవరణ బిల్లును, న్యూక్లియర్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని కోరారు. 100 శాతం ఫారన్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ చట్టాలను, వికసిత్ భారత్ శిక్షా అభియాన్ బిల్లును 2025ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. దేశంలో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఎన్‌హెచ్‌ఎం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, తగిన వేతనాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ అనునిత్యం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, గొనె మని, విజయలక్ష్మి, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, జక్కుల రాములు, మల్లికార్జున్ రావు, నజీర్ అహ్మద్, నిర్మల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :