Thursday, 17 September 2026 11:58:10 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

బూర్గంపహాడ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, పలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించిన సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి

Date : 09 December 2025 05:12 PM Views : 269

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులు, పంపిణీ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి మంగళవారం విస్తృత పర్యటన చేపట్టారు. ఎన్నికల విధానాలు, సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా పరిశీలకులు బూర్గంపహాడ్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామగ్రి, టోకెన్లు, బ్యాలెట్ బాక్సులు మరియు ఇతర వనరుల పంపిణీపై అక్కడి అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు సమయపాలనతో, శాస్త్రీయంగా, గందరగోళం లేకుండా చేపట్టాలని సూచించారు. మోరంపల్లి బంజార జడ్‌పీహెచ్‌ఎస్, పినపాకపట్టినగర్ జడ్‌పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ సౌకర్యాలను పరిశీలించి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు వినియోగదాయకమైన విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాల సమన్వయం కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పారు. అనంతరం పరిశీలకులు మోరంపల్లి బంజార, అలాగే యెల్లందు క్రాస్ రోడ్ – కొత్తగూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సందర్శించారు. చెక్‌పోస్ట్‌లలో డ్యూటీలో ఉన్న అధికారులతో మాట్లాడి, ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా, డబ్బు పంపిణీ, మద్యం రవాణా వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలను కట్టడి చేయడానికి ప్రతి వాహనాన్ని కచ్చితంగా మరియు పారదర్శకంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏ వాహనం కూడా తనిఖీ లేకుండా పంపితే బాధ్యత సంబంధిత అధికారులదే అవుతుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సంబంధిత మండల అధికారులతో పాటు పోలీస్ విభాగం, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :