తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట మండలం లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆకస్మికంగా సందర్శించారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు ఏ తరగతి చదువుతున్నారు భవిష్యత్తులో ఏమవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుసుకున్నారు కొంతమందిని పాఠాలు చదివిస్తూ మరికొంతమందిని ప్రశ్నలు అడిగి వారి శక్తిని పరిశీలించారు పిల్లలు ధైర్యంగా సమాధానాలు చెప్పడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.ఈ పాఠశాలలో ఎమ్మెల్యే వరలక్ష్మి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా ప్రత్యేకత ఏమాత్రం చూపకుండా సాధారణంగానే పాఠశాల పనితీరును పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ బోధన విధానం విద్యార్థుల హాజరు శాతం పాఠశాలలో వసతులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ