Wednesday, 04 November 2026 07:09:25 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

సింగరేణి ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్.

Date : 12 August 2026 07:35 PM Views : 137

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్.సింగరేణి ప్రధాన ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కలియతిరిగి పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, సర్జికల్ వార్డు, ఐసీయూ, పురుషుల వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, ఇమ్యునైజేషన్ విభాగం తదితర విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు.వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, పారిశుధ్యం, రోగులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ప్రసూతి మరియు శిశు వైద్యం, శస్త్రచికిత్సలు తదితర సేవల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఈ తనిఖీలో సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ , Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్, నాగభూషణం, రాంప్రసాద్, సింగరేణి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :